డొమెస్టిక్ వయోలెన్స్ చట్టం - మహిళలకు ఊరట
ఈ పుస్తకం చట్టం గురించిన అవగాహన, దానిని ఏవిధంగా ఉపయోగించుకోవచ్చో తెలుపుతుంది.
2006 లో అమల్లోకి వచ్చింది ‘కుటుంబ హింస నుంచి రక్షణ చట్టం.
కుటుంబంలో జరిగ్తే భావోద్రేక, మానసిక, శారీరక, లైంగిక హింసా రూపాలన్నింటిని మొట్టమొదటి సారిగా గుర్తించినది ఈ చట్టం.
స్త్రీలకు వారి హక్కులను తెలుపుతూ చైతన్యవంతులను చేస్తూ కుటుంబంలో, కుటుంబం ఆవల అందుబాటులో ఉన్న సేవలు, సహాయ సహకారాలు గురించి తెల్పడం వారి తరపున పోలీసులతో, కుటుంబాలతో మాట్లాడటం వంటివి చేస్తూ ఉంటాము. ఈ నేపథ్యంలో స్త్రీల సంఘాల పోరాట ఫలితంగా అక్టోబర్ 2005 లో ఈ డి.వి. చట్టం వచ్చింది. కార్యకర్తలకు, సంస్థలకు స్త్రీల జీవితాలలో శాంతి కోరుకునే వారికి ఉపయోగకరంగా ఉండగలదనే ఉద్దేశంతో సన్నిహిత సంస్థ తరపున ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది.
ఈ పుస్తక సంకలనానికి సహకరించిన యం.ఎ. వనజ, అడ్వకేట్ గారికి, ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించిన సన్నిహిత సంస్థ ఉషారాణి, మరియు పి.పవన్ గార్లకు బొమ్మలకు సహకరించిన అన్వర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.